Original text by "Rajshri" Sudhakar & Hari Kavi (B Harikrishna)
సాయి నక్షత్ర మాల Song 7 - తెలుగు
ఊదిని మాకు అందించి
తొలగించేవు పాపములు
నీ నామస్మరణే శాంతికి నెలవట
అల్లా నామం పలికావే
అందరి మంచి కోరావే
సర్వమతములు ఒకటేనని
సమరస భావము పెంచావే
నిప్పులో పడిన కమ్మరి బాలుని
కరములు చాటి కాచావే
పాము కరవగా షామ బెదరగా
విషమును నీవు తొలగించాలి
కుష్టు రోగిని దరి చేర్చి
ఆశ్రయమిచ్చి బ్రోచావే
మానవత్వమే చాటావు
మహిలో మహాత్ముడైనావు
Page 1 of 3
Use tabs to navigate

Subscribe for new verses
