Original text by "Rajshri" Sudhakar & Hari Kavi (B Harikrishna)
సాయి నక్షత్ర మాల Song 6 - తెలుగు
మతమార్పిడి తగదంటివి
మతమే తండ్రిని అంటివి
జీవకోటిని ప్రేమించినావే
అన్న బాబా సాయి నీవే
ఉడికే వంటకం చేతితో కలిపి
రుచికరముగా వండినావట
ఆకలిగొన్న జనులను పిలిచి
కడుపులు నింపినావట
హేమాత్మంతుని ప్రేరేపించి
జీవిత చరితను వ్రాయమంటివి
వ్రాసిన చరిత పారాయణం చేయగా
అతనికి ముక్తి కలిగిని
కోటి దేవుళ్ళ కొలువు నీవే
అందించు మాకు సకల వరములు
జీవితమంతా నీ తలపులతో గడిపిస్తాను సద్గురు
Page 1 of 3
Use tabs to navigate

Subscribe for new verses
