Original text by "Rajshri" Sudhakar & Hari Kavi (B Harikrishna)
సాయి నక్షత్ర మాల Song 8 - తెలుగు
గీసుకున్న గీత నీవు దాటలేదే
నీ జీవితాన్ని ఆదర్శం చేసినావే
అందరి మనసు నీవు దోచినావే
అన్న బాబాగా ముంగిట వెలసినావే
బూటి కలలోన నీవు కనిపించి
మందిరం ఒకటి కట్టమన్నావే
తాత్యా మరణాన్ని ఆపావే
అతనికి బదులుగా సమాధి అయినవే
లక్ష్మీబాయిని నీవు పిలిచి
ఇచ్చావట తొమ్మిది నాణెములు
భక్తి మార్గాలనే చూపి మోక్షగానిగా నీవు వెలసినావే
సమాధి నుండి నీవు పలికినావే
హారతి ఇమ్మని కోరినావే
మురళీధరుడై నీవు వెలసినావే
కరుణ కే సంద్రమై నిలిచినావే
Page 1 of 3
Use tabs to navigate

Subscribe for new verses
