Original text by "Rajshri" Sudhakar & Hari Kavi (B Harikrishna)
సాయి నక్షత్ర మాల Song 1 - తెలుగు
సాయి నక్షత్ర మాల ఇది
పాప వినాశక మంత్రం ఇది
జపించుటకు ఇది సులభము
శుభఫలముల సూత్రము
ఎత్తుగా ఉన్న ఊయల పైన
ఆసీనుడవు ఐతివి
హాయిగా సయనిస్తివి
బల్లి రాకని ముందుగా తెలిపి
జ్ఞాన జ్యోతిని చూపితివి
బృందావనముగా లేండి వనమును
అందముగా మలచితివి
అనురాగం నింపితివి
మార్గదర్శిగా నిలిచినావే
మహిమాన్వితుడవు ఐతివి
అన్న బాబాగా వెలసితివి
Page 1 of 3
Use tabs to navigate

Subscribe for new verses
